Meeting of Tenant Farmers: మాటలతో కాకుండా.. హామీలు అమలు చేయాలి: మేధా పాట్కర్ - కౌలు రైతుల సమావేశం
🎬 Watch Now: Feature Video
Meeting of Tenant Farmers: రాష్ట్రంలో కౌలు రైతుల కన్నీరు చూసి మనసు కలచి వేసిందని, పాలకులు మాటలతో కాకుండా హామీలను ఆచరణతో అమలు చేసి చూపించాలని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకురాలు మేధా పాట్కర్ సూచించారు. విజయవాడలో రైతు స్వరాజ్య వేదిక కౌలు రైతుల సమస్యలపై బహిరంగ విచారణ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలమూలల నంచి కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మేధా పాట్కర్ మాట్లాడుతూ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. భూ యజమాని సంతకం అనే నిబంధన తొలగించాలన్నారు. కౌలు రైతులకు రుణాలు, నష్టపరిహారం అందించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. దేశానికి అన్నం పెడుతున్న కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.. వారిని చిన్నచూపు చుడటం సరికాదని చెప్పారు. దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం చేసేది కౌలు రైతులేనని, ప్రభుత్వం వారి కష్టాలను పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో కౌలు రైతులు వ్యవసాయం చేసే విధానం ఉండదన్నారు. అప్పులు తీర్చలేక చాలామంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు.