కడపలో ముసుగు దొంగల హల్చల్.. భయాందోళనలో ప్రజలు..! సీసీ కెమెరాలో దృశ్యాలు..

🎬 Watch Now: Feature Video

thumbnail

Mask robbers are theft at night times targeted only locked houses : కడప నగర శివారులో గత రెండు రోజులు నుంచి రాత్రుల సమయంలో ముసుగు దొంగలు సంచరిస్తున్నారు. శివారు ప్రాంతంలో ముసుగు దొంగల ముఠా తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. ముఖానికి గుడ్డలు కట్టుకొని తలకు నల్లని టోపి ధరించి చేతులలో ఇనుప చువ్వలను పట్టుకొని నగర వీధుల్లో తిరుగుతున్నారు. నగర శివారులోని ఊటుకూరు ప్రాంతంలో దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు సిసి కెమెరాలలో రికార్డు అయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనుకు గురువుతున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఆ నలుగురు దొంగల వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్​కి ఒక్క పోలీసు కూడా రాకపోవడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. పోలీసు వ్యవస్థ సరిగా లేకపోవటం వల్ల జిల్లాలో ఈ మధ్య కాలంలో దొంగతనాలు పెరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలో పెట్రోలింగ్ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని కోరారు. లేకపోతే దొంగలు చోరీలతో పాటు ప్రజలపై దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దొంగలు స్థానికులు కాదని ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా ప్రజలు భావిస్తున్నారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.