"యువతను ఉత్తమ క్రీడాకారులుగా మార్చేందుకు లోకేశ్ కృషి" - ఆడుదాం ఆంధ్రా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 1:56 PM IST
Mangalagiri Premium Cricket League: గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. లోకేశ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరిలోని నారా లోకేశ్ క్రీడా మైదానంలో, మంగళగిరి ప్రీమియం క్రికెట్ లీగ్ పోటీలను ఎమ్. ఎస్ రాజు, తెనాలి శ్రావణ్ కుమార్, నజీర్ అహ్మద్ ప్రారంభించారు.ఈ రోజు నుంచి 28తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో 100 జట్లు పాల్గొననున్నాయని వివరించారు. ఈ పోటీల ద్వారా మొదటి విజేతకు రెండు లక్షలు, రన్నరప్‌కు లక్ష, మూడో స్థానంలో నిలిచిన జట్టుకి 50 వేల రూపాయల బహుమతిని అందించనున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో యువత గంజాయికి బానిసవుతుంటే, వారిని సరైన మార్గంలో నడిపించేందుకు లోకేశ్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీలు చూసైనా అధికార పార్టీ నాయకులు క్రీడలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలన్నారు. ఆడుదాం ఆంధ్రా పోటీలు క్రీడాకారులు లేక వెలవెలబోతున్నాయని వివరించారు.