ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు చేతిలోనే ఉంది - టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు - tdp mla eluri latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 16, 2023, 1:46 PM IST
Mana Palleku Mana Eluri program in Idupulapaya : ఒక్క చాన్స్ అంటూ వచ్చి.. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన వైసీపీ.. అరాచక పాలన చేస్తోందని పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి పాలనలో అరాచకం, విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు.బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలో చేపట్టిన 'మన పల్లెకు మన ఏలూరి' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో జగన్ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు.
Babu Surity Bhavishattu Gaurantee Pamphlets Distribution By Eluri: వైసీపీ చేసిన మోసాలు ప్రజలకు తెలియజేయడానికి .. మన పల్లెకు మన ఏలూరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాదయాత్రను ఇడుపులపాడులో టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆంజనేయస్వామి దేవాలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించిన నాయకులకు అడుగడుగునా మహిళలు హారతులతో నిరాజనం పలికారు . గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను అందించారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను సాంబశివరావు ప్రజలకు వివరించారు. ఈ పాదయాత్రలో గ్రామస్థులు.. వారి సమస్యలను ఎమ్మెల్యే ఏలూరి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నరాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.