ఫుల్లుగా మద్యం పుచ్చుకుని, స్మశానవాటిక పొగ గొట్టం ఎక్కాడు- అధికారులను ముప్పుతిప్పలు పెట్టాడు - విజయవాడలో గంజాయి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 1:19 PM IST
Man Climbed Up Smoke Pipe : విజయవాడలో ఆగంతకుడు మత్తులో హల్ చల్ సృష్టించారు. అతను చేసిన నిర్వాహానికి అధికారులు తలలు పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలోని స్మశాన వాటిక పొగ గొట్టం పైకి ఎక్కి ఆగంతకుడు హల్ చల్ చేసాడు. గంజాయి మత్తులో పైకి ఎక్కి ఉంటాడని స్ధానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.ఆగంతకుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దింపే ప్రయత్నం చేయడంతో వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. ఆధికారులు ఎన్నో వ్యయప్రయాసలు పడి ఆగంతకుడు పొగ గొట్టం నుంచి కిందకు దింపారు. గంజాయి మత్తులో తూలుతూ కిందకు దిగాడని, ముత్తులోనే పొగ గొట్టం పైకి ఎక్కి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. కిందకు దిగిన తర్వాత కూడా ఆ వ్యక్తి తూలుతూ అక్కడి నుంచి జారుకున్నాడు. రిక్షా తొక్కే రాజుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.