జగన్ను గద్దె దించే వరకు మాదిగల పోరాటం ఆగదు: ఆకుమర్తి చిన్నా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 7:02 PM IST
Madiga State Leader Akumarthi Chinna Resigns From YCP: రాజమహేంద్రవరంలో వైసీపీకి మాదిగ రాజకీయ పోరాట వ్యవస్థాపక అధ్యకుడు ఆకుమర్తి చిన్నా మాదిగ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో మాదిగలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. మాదిగలకు ద్రోహం చేసిన పార్టీలో కొనసాగలేమని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం మాదిగల్ని నమ్మించి మోసం చేసిందని, రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర అన్యాయం చేసిందని ఆకుమర్తి చిన్నా అన్నారు. సీఎం జగన్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవుల కేటాయింపులో వివక్ష చూపారని తనను అన్నివిధాలా వాడుకొని వదిలేశారని చెప్పారు. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు.
దళిత యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని జగన్ వెంటేసుకొని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. శిరోముండనం కేసులో నిందితుడుగా ఉన్న తోట త్రిమూర్తులుకి ఎమ్మెల్సీ కట్టబెట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను గద్దె దించే వరకు మాదిగల పోరాటం ఆగదని హెచ్చరించారు. రాష్ట్రానికి అమరావతే రాజదానిగా ఉండాలని మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని అన్నారు. ఏ పార్టీలో చేరబోతున్న అంశాలపై త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.