రికవరీ వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ - ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
🎬 Watch Now: Feature Video
Lorry Hit to Recovery Vehicle in Eluru District : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిపోయిన వాహనాలను తరలించే రికవరీ వ్యానును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో.. రికవరీ వ్యాన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండగా.. క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రికవరీ వ్యాన్.. ఆగిపోయిన కారును వాహనానికి కట్టుకొని హైదరాబాద్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న రికవరీ వ్యాన్‌ను తాడువాయి వద్ద.. ఒక్కసారిగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని.. రికవరీ వ్యాన్‌ల్లో చనిపోయిన వారిని జేసీబీ సాయంతో బయటికు తీసారు. అప్పటికే శరీర భాగాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. ప్రమాదం జరగడం వల్ల మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోడంతో.. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధకరించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ఘటనలో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యార్థి చదువుతున్న పాఠశాల బస్సే బాలుడిని బలి తీసుకుంది. కుంచనపల్లి గ్రామానికి చెందిన దేవదత్తు అనే బాలుడు ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన బాలుడు తరగతులు ముగిశాక సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా.. నిట్ అవుట్ గేట్ వద్ద బస్సు బలంగా ఢీ కొట్టింది. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొన ఊపిరితో ఉన్న దేవాదత్తును నిట్ విద్యార్థులు, స్థానికులు హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలు పగిలెలా రోదించారు. బస్సు డ్రైవర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.