ఇసుక లారీ ఢీకొని ఒకరు మృతి - కుటుంబసభ్యులు వచ్చే లోపే పోలీసులు ఏంచేశారంటే? - ఇసుక లారీ ఢీకొని మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 12:41 PM IST
Lorry Hit Bike In Ongole District Today : ఒంగోలుకు సమీపంలోని యరజర్ల మార్గంలో ఇసుక లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాద స్థలికి సమీపంలో నిర్మాణంలో ఉన్న అధికార పార్టీకి చెందిన బంధువుకు వెంచర్‌కు ఇసుక తీసుకెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు క్విజ్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న చిరంజీవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Road Accident at Prakasam District Lorry Hits Two Wheeler 1 Dead : హుటాహుటిన ఘటనాస్థలి నుంచి మృతదేహాన్ని తరలించిన పోలీసులు ప్రమాదానికి కారణమైన ఇసుక లారీని అక్కడ నుంచి పంపించివేశారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లకముందే మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించడంపై చిరంజీవి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందించకుండా మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారని మృతుడి బంధువులు ఆరోపించారు.