నడిరోడ్డుపైనే ముగిసిన జీవనపోరాటం - టైర్ పంక్చర్ వేస్తుండగా వాహనం ఢీ కొట్టడంతో లారీ డ్రైవర్ మృతి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 12:05 PM IST
Lorry Driver Died Hit by Unknown Vehicle: టైర్ పంక్చర్ వేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టటంతో లారీ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పల్నాడు జిల్లా రావిపాడు సమీపంలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుడు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం మంతెనవారిపాలేనికి చెందిన కొండముది రవీంద్ర గా పోలీసులు గుర్తించారు.
Driver Spot Dead: ఆదివారం అర్ధరాత్రి రవీంద్ర లారీలో ప్రయాణిస్తుండగా టైర్ పంక్చర్ అయింది. ఆ సమయంలో లారీని రోడ్డు పక్కకు ఆపి డ్రైవర్ రవీంద్ర పంక్చర్ వేస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టటంతో మృతి చెందాడు. ఢీ కొట్టిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట గ్రామీణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని, ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.