Leopard Wandering : అదిగో చిరుత..! పొలం పనుల వద్దకు రావడంతో హడలెత్తిన 'అనంత' వాసులు - చిరుత పులి సంచారం
🎬 Watch Now: Feature Video
Leopard Wandering In Kalyandurgam : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గూబనపల్లి- దొడగట్ట గ్రామాల మధ్య పులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కళ్యాణదుర్గం సమీపంలో ఉన్న ఈ రెండు గ్రామాల మధ్య ఓ రైతు తన వ్యవసాయం పొలం వద్ద పొక్లెయిన్‌తో చదును చేస్తుండగా పొదల్లో చిరుత కనిపించింది. జేసీబీ ఆపరేటర్ చిరుతను అతి సమీపం నుంచి తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే గూబనపల్లి కొండ ప్రాంతాల్లో పలు పర్యాయాలు చిరుతపులులు కనిపించటం.. తాజాగా ఈ ఘటనతో రెండు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు.
ఇటీవల కళ్యాణదుర్గం అటవీ ప్రాంతంలో అడవి జంతువుల బెడద అధికం అవుతోందని గ్రామస్థులు తెలిపారు. వాటి కట్టడికి అటవీశాఖ అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని విన్నపించారు. అదేవిధంగా తక్షణమే స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.