Left Parties Protest to Reduce the Electricity Charges: పెంచిన విద్యుత్​ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాల ఆందోళన - విశాఖ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 9:09 PM IST

Left Parties Protest to Reduce the Electricity Charges : పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వాటికి వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. విద్యుత్ ఉద్యమ అమరవీరులకు మాజీ ఎంపీ పి. మధు నివాళులర్పించారు. 

ఈ సంద్భరంగా మాజీ ఎంపీ మధు మాట్లాడతూ.. విద్యుత్ చార్జీలు రూ.100 ఉంటే దానికి అదనంగా మూడు రెట్లు పెంచి ప్రజలపై భారాన్ని వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనా మహమ్మారితో ఆర్థికంగా బాధపడుతున్న ప్రజలపై అదనంగా విద్యుత్ భారాలు మోపడం అన్యాయమని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని నినాదాలు చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యుత్ అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.