లాటిన్ అమెరికా కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్ డైరెక్టర్గా ఎల్.పి.హేమ్నాథ్ - LACTC is an alliance of 33 countries
🎬 Watch Now: Feature Video

లాటిన్ అమెరికా కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్ -ఎల్ఏసీటీసీ డైరెక్టర్ ఎల్.పి. హేమ్నాథ్ నియమితులయ్యారు. లాటిన్ అమెరికా కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్ మొత్తం 33 దేశాల కూటమితో ఏర్పాటైంది. చెన్నైలో జరిగిన సమావేశంలో హేమ్నాథ్ కె. శ్రీనివాసులును డైరెక్టర్గా ఎన్నుకున్నారు. లాటిన్ అమెరికా కరేబియన్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ ట్రేడ్ కౌన్సిల్ కీలక భూమిక పోషిస్తోంది. సభ్యదేశాల మధ్య వ్యాపార కార్యకలపాలు నిర్వహణను ట్రేడ్ కౌన్సిల్ చూస్తోంది. భవిష్యత్‌లో లాటిటన్ అమెరికా కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్ మధ్య వ్యాపార వృద్ధికి కృషి చేస్తానని హేమ్నాథ్ కె. శ్రీనివాసులు చెప్పారు. ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రష్యన్ ఫెడరేషన్ కౌన్సెల్ జనరల్ ఓలెగ్ ఎన్.అద్దీప్, ఇండోనేషియా ట్రేడ్ ప్రమోషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అజి కహ్యది, భారత విదేశీ వ్యవహారాలకు చెందిన ఉన్నతాధికారి వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఏసీటీసీ డైరెక్టర్ ఎల్.పి.హేమ్నాథ్ మాట్లాడుతూ.. తనను డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు లాటిన్ అమెరికా కరేబియన్ సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.