జీవో 512తో సామాన్యుల కన్నా వైసీపీ నేతలకే లబ్ధి - రద్దు చేయాలని న్యాయవాదుల ఆందోళన - జీవో 512 రద్దు చేయాలని న్యాయవాదుల నిరసనలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 10:05 PM IST
Land Rights Act in AP : భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలంటూ కర్నూలులో 16వ రోజు న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్నూలు ధర్నా చౌక్ వద్ద లాయర్లు సంతకాల సేకరణ చేపట్టారు. ఎలాంటి చర్చల్లేకుండానే ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితో చీకటి జీవోను తీసుకువచ్చిందని లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 512ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Lawyers Protest to Repeal the Land Rights Act : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన భూ హక్కు చట్టం ద్వారా చిన్న, సన్నకారుల రైతులు నష్టపోతారని లాయర్లు తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన చట్టం ద్వారా భూ వివాదాల సమస్యను కోర్టు దృష్టికి తీసుకు రాకుండా జిల్లాకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజల కన్నా వైసీపీ నేతలకే ఎక్కువగా లబ్ధి చేకూరేలా ఉందని ఆరోపించారు. భూ కబ్జాదారులకు అనుకూలమైన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 512ను రద్దు చేసే వరకు పోరాడుతామని హెచ్చారించారు.