కొబ్బరి, జీడి, మొక్కజొన్న పంటలను యంత్రాలతో తవ్వేసిన వైసీపీ నాయకులు - చోద్యం చూసిన పోలీసులు - రైతుల భూములు లాక్కున్న వైసీపీ అధికారులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 7:51 PM IST
Land Issue In Srikakulam District : రణస్థలం మండలం కోటపాలెంలో సర్వే నంబరు 59-6 లో 5.63 ఎకరాల ప్రభుత్వ భూమిని గత కొన్నిదశాబ్దాలుగా గ్రామానికి చెందిన కొందరు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఇందులో అప్పలనర్సయ్యకు ఎకరా భూమి సాగు చేసుకునేందుకు 1982లో అప్పటి తహసీల్దారు లీజు పట్టా ఇచ్చారు. అప్పలనర్సయ్య మృతి తర్వాత అతని అల్లుడు అయిన రాయపురెడ్డి అప్పారావు సాగులో ఆ భూమి ఉంది.
Farmer Fires On YCP Leaders in Ranastalam : కేవలం టీడీపీ సానుభూతి పరుడనే నెపంతోనే భూమిని జగనన్న పట్టాల పేరుతో పంపిణీ చేసేందుకు బలవంతంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు లాక్కుంటున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం పొలంలో ఉన్న కొబ్బరి, జీడి, మొక్కజొన్న పంటలను పోలీసుల సమక్షంలో యంత్రాలతో తవ్వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం రాజకీయ కక్షతోనే తన ఆధీనంలో ఉన్న పొలాన్ని లాక్కుంటున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అధికారం చేతిలో ఉందని వారు వైసీపీ నాయకులు అలా ప్రవర్తించడం తగదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.