వెన్న కృష్ణుడి అలంకరణలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి - తెలుగు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

Yadadri Lakshmi narasimha swamy temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. ఈరోజు స్వామివారు వెన్న కృష్ణుడు అలంకరణలో ఆలయ మాడ వీధిలో సేవపై ఆలయ అర్చకులు ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ, వేదపండితుల వేదపారాయణాలు దివ్య ప్రబంధ పారాయణల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి నాల్గో రోజు వైభవంగా జరిగింది. భక్తులకు వెన్న కృష్ణుడు అవతార విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST