KVPS Leader Duddu Prabhakar: దుడ్డు ప్రభాకర్ అరెస్టు.. పౌరహక్కుల సంఘం నేతల ఆందోళన - RK wife Sirisha arrest
🎬 Watch Now: Feature Video
Agitation on Duddu Prabhakar Arrest: కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ను ఎన్‌ఐఏ పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడాన్ని పౌరహక్కుల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. బేషరతుగా ఆయన్ని విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల హక్కు కోసం పోరాటం చేస్తుంటే.. తమ పోరాటాల్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, సామంత రాజ్యాలుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అరెస్టు చేస్తున్న సమయంలో ఎందుకు అరెస్టు చేస్తున్నారని కుటుంబ సభ్యులు ప్రశ్నించిన కూడా పోలీసులు సమాధానమివ్వలేదని అన్నారు. ఎటువంటి ఆధారాలు చూపకుండా అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. అజిత్ సింగ్ పోలీసులకు దుడ్డు ప్రభాకర్ పెద్ద కుమార్తె స్వాతి ఫిర్యాదు చేశారు. మరోవైపు దివంగత మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఎన్‌ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . గతంలో దుడ్డు ప్రభాకర్, శిరీష ఇళ్లలోనూ ఎన్ఐఏ, ఇతర సంస్థల అధికారులు సోదాలు జరిపారు.