KTR About Chandrababu Health: కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసు: తెలంగాణ మంత్రి కేటీఆర్ - చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ట్వీట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2023, 10:53 PM IST
KTR About Chandrababu Health: చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ చేసిన ట్వీట్ బాధ కలిగించిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకు కూడా ఆందోళన కలిగిందని గుర్తు చేశారు. మహానగరం ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే.. హైదరాబాద్‌లో ఆందోళనలు వద్దంటున్నామని వివరించారు.
భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. ఎన్నడూ ఏ తప్పూ చేయని చంద్రబాబుపై ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని.. అనారోగ్య కారణాలతో అంతమొందించే ప్రణాళిక ఏదో రచిస్తున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు, తాగునీటి సమస్యను ఎదుర్కుంటున్నారని.. బరువు తగ్గడం, ఇన్‌ఫెక్షన్‌లు, అలర్జీలతో సకాలంలో వైద్య సహాయం పొందలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జైలు అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని.. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండగా ముద్దాయి అని హెల్త్ బులిటెన్లో పదే పదే పేర్కొనేందుకు శ్రద్ధ పెడ్తున్నారని ఆరోపించారు. ఆ శ్రద్ధ ఆయన ఆరోగ్యంపై పెట్టడం లేదన్నారు. చంద్రబాబుకు ఏ హాని జరిగినా కూడా వైసీపీ ప్రభుత్వానిది, జైలు అధికారులదే బాధ్యత అని లోకేశ్ అన్నారు.