Bc colony people protest : 'మా సమస్యలు పట్టవా..?' సచివాలయానికి తాళం వేసి... బీసీ కాలనీ వాసుల ఆందోళన - Latest Anantapur News
🎬 Watch Now: Feature Video
BC Colony Residents locked the village secretariat: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వి.కోత్తకోట గ్రామ సచివాలయానికి బీసీ కాలనీ వాసులు తాళం వేసి నిరసన తెలిపారు. గ్రామంలో బీసీ కాలనీలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసులు మాట్లాడుతూ.. సరైన మౌలిక వసతులు లేకపోవడంతో త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదని వాపోయారు. కాలనీలో రోడ్లు బురదమయంగా మారి నీటితో నిండి పోయాయి. చిన్న పిల్లలు, విద్యార్థులు బయటకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. కాలనీలో రోడ్డు వేసేదాకా సచివాలయం తెరిచేది లేదని గ్రామస్థులు తేల్చిచెప్పారు. గ్రామానికి అధికారులు, ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా బీసీ కాలనీకి మాత్రం రావడం లేదని కాలనీ వాసులు వాపోయారు. అనంతరం కాలనీలో బురదమయంగా మారిన రహదారిపై నాట్లు వేసి నిరసన తెలియజేశారు. అధికార పార్టీ నేతలు.. గ్రామంలో గడప గడపగడప కార్యక్రమం నిర్వహించినా తమ బీసీ కాలనీ వైపు రాకుండా వెళ్లిపోయారని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన అధికారులు స్పందించి తాగునీరు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ కాలనీ వాసులు కోరుతున్నారు.