Koteswara Rao Painted Pictures of Freedom Fighters : 'మహనీయులు.. మరపురాని ఘట్టాలు'.. ఆకట్టుకుంటున్న కోటేశ్వర్​రావు పెయింటింగ్ - nandyal Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 15, 2023, 12:32 PM IST

Koteswara Rao Painted Pictures of Freedom Fighters: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాకు చెందిన చిత్రకారుడు చింతలపల్లి కోటేశ్వరరావు... 380 మంది స్వాతంత్య్ర సమరయోధుల ముఖ చిత్రాలతో భారతదేశ పటాన్ని రూపొందించారు. ఏ-3 డ్రాయింగ్ షీట్ పై నీటి రంగుల(Water Colours)తో ఈ చిత్రాలను గీశారు. స్వాతంత్ర సమర యోధులు, ప్రముఖుల చిత్రాలను గీసి అందరితో ఔరా అనిపించుకున్నారు. ఈ చిత్ర పటం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిని రూపొందించడానికి ఎనిమిది గంటల సమయం పట్టిందని కోటేశ్వర్ రావు తెలిపారు. స్వాతంత్ర్యద్యమ కాలంలో  జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రాలు వేశారు. ఈ చిత్రాలతో స్వాతంత్ర్య సమర యోధులకు నివాళులు అర్పించినట్లు చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్వరరావు అన్నారు. ఈ సంద్భరంగా ఆయన మాట్లాడుతూ... బ్రిటిషర్ల నుంచి భరతమాత విముక్తి కోసం పోరాడిన మహనీయుల తాగ్యం వేల కట్టలేనిది అన్నారు. ఆనాటి పోరాట యోధుల త్యాగం వల్లే మనం స్వాతంత్య్రం పొంది.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు. ప్రజలందరికీ ఈ చిత్రాల ద్వారా 76వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.