thumbnail

By

Published : Jul 2, 2023, 5:13 PM IST

ETV Bharat / Videos

IFSC Results ఐఎఫ్​ఎస్​లో మొదటి ర్యాంకు ఎలా దక్కిందంటే..? బాపట్ల యువకుడి అనుభవాల మాలిక..!

Kollur Srikanth got first rank in IFSC Exam: ఇండియన్ ఫారెస్ట్‌ సర్వీస్‌లో జాతీయస్థాయిలో తొలిర్యాంకును బాపట్లకు చెందిన కొల్లూరు శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. యూపీఎస్సీ నిర్వహించిన ఐఎఫ్​ఎస్సీ పరీక్షల్లో మొదటి ర్యాంకు రావడం పట్ల శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశాడు. ఎలాంటి శిక్షణ తీసుకోకుండా ఇంట్లోనే ఉండి ప్రతిరోజూ 6 నుంచి 8 గంటలు ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమైనట్లు వెల్లడించాడు.  తండ్రి వెంకటరమణ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. చిన్నతనం నుంచి శ్రీకాంత్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడని తల్లిదండ్రులు తెలిపారు. 2020లో తొలి ప్రయత్నంలో సివిల్స్ లో ప్రిలిమ్స్ పూర్తి చేసి మెయిన్స్ వరకు వెళ్లాడు. శనివారం వెల్లడించిన ఫలితాలలో ప్రథమ ర్యాంకు రావడం చూసి చాలా సంతోషం కలిగింది అమ్మానాన్నల కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూసా శిక్షణ అనంతరం ఐఎఫ్ఎస్సి క్యాడర్ అధికారిగా రాష్ట్రంలో పోస్టింగ్ తీసుకుంటా వాతావరణ మార్పు పర్యావరణ కాలుష్యం అందరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు అటవీ విస్తీర్ణం పెంచడం జీవ వైవిధ్య పరిరక్షణకు అంకిత భావంతో పనిచేసే ప్రకృతిని కాపాడే బృహ త్కార్యంలో అందర్నీ భాగస్వాములు చేస్తారని శ్రీకాంత్ అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.