Kodi Katti Case latest Updates : 'వచ్చే ఎన్నికల్లోనూ ప్రచార అస్త్రంగా కోడికత్తి కేసు!' ఐదేళ్లవుతున్నా దొరకని బెయిల్ - ys jagan kodi katti case

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 1:20 PM IST

Kodi Katti Case latest Updates Trial in Visakha NIA Court : విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణకు నిందితుడు శ్రీనును హాజరయ్యాడు. రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న శ్రీనును విచారణ సందర్భంగా విశాఖకు తీసుకువచ్చారు. శ్రీను కుటుంబసభ్యులు సైతం ఇక్కడకు చేరుకున్నారు. ఇప్పటివరకు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది.  

కుట్ర కోణం లేదని తేల్చినా.. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయనపై దాడి జరిగింది. నిందితుడు శ్రీను.. కోడి పందేల్లో ఉపయెగించే కత్తితో దాడి చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదేళ్ల నుంచి కోడి కత్తి కేసు విచారణ విజయవాడలోని ఎన్​ఐఏ కోర్టు (NIA Court) లో కొనసాగుతోంది. కేసులో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ ఇప్పటికే తేల్చినా.. నేటికీ నిందితుడు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు.  

వచ్చే ఎన్నికల వరకూ.. సీఎం జగన్ తరఫున న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఎం జగన్ (CM Jagan) హాజరుకావాలని లేదా బెయిల్ ఇవ్వాలని శ్రీను తరఫు న్యాయవాది సలీం విజ్ఞప్తి చేశారు. కోర్టుకు వెళ్లే ముందు శ్రీను తరఫు న్యాయవాది సలీం మాట్లాడారు. జగన్‌ ఎన్‌వోసీ అయినా ఇవ్వాలి, వాదనలైనా వచ్చి వినిపించాలని అన్నారు. కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ ఇప్పటికే చెప్పిందని గుర్తు చేసిన శ్రీను తరఫు న్యాయవాది... రాజకీయాల కోసమే కేసును వాయిదా వేస్తున్నట్లున్నారు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమో అని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.