అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని పాఠశాల విద్యార్థి కిడ్నాప్ - ఫోన్ చేసి నాలుగు లక్షలు డిమాండ్ - kakinada district latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 11:26 AM IST
|Updated : Nov 10, 2023, 1:55 PM IST
kidnap a student from school Rapido boy brought safely: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో మూడో తరగతి విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. తాడి దుర్గా నాని అనే విద్యార్థి గురువారం సాయంత్రం కిడ్నాప్‌కు గురవ్వగా పోలీసుల రాకతో బయటపడ్డాడు. ఆగంతకుడు విద్యార్థి అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని.. తాను వాళ్ల బంధువునని మాయ మాటలు చెప్పి నానిని పాఠశాల నుంచి ఎత్తుకెళ్లాడు. విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే నానీని చంపేస్తానని బెదిరించాడు. దాంతో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అప్రమత్తమై టీవీ, సోషల్ మీడియాలో వార్తను హల్ చల్ చేయడంతో ఆగంతకుడు భయపడ్డాడు. తెలివిగా వ్యవహరించి ర్యాపిడో బైక్ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడి బాలుడిని పాఠశాల వద్ద దించమని చెప్పి పరారయ్యాడు. విషయం తెలుసుకున్నపోలవరం డీఎస్పీ లతా కుమారి.. ర్యాపిడో ప్రతినిధికి వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా కిడ్నాపర్‌ను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.