Jyothi Surekha and Hampi Reached Gannavaram : 'ఆసియా' విజేతలు.. జ్యోతిసురేఖ, కోనేరు హంపికి గన్నవరంలో ఘనస్వాగతం
🎬 Watch Now: Feature Video
Jyothi Surekha and Hampi reached Gannavaram : ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన జ్యోతి సురేఖ, కోనేరు హంపితో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించటం గర్వంగా ఉందని జ్యోతి సురేఖ, హంపి తెలిపారు. చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలు (19th Asain games) ఆర్చరీలో మొదటిసారిగా బంగారు పతకం సాధించటం గర్వంగా ఉందని వెన్నం జ్యోతి సురేఖ అన్నారు. ఒకేసారి మూడు పతకాలు రావటం చాలా సంతోషంగా ఉందన్నారు.
చెస్ పోటీల్లో రజతం సాధించటం ఆనందంగా ఉందని కోనేరు హంపి పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో చెస్ పోటీలు రెగ్యులర్గా జరిగేవి కావని అన్నారు. 2006, 2010 తరువాత.. మళ్లీ ఈ సంవత్సరం జరిగాయని అన్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో కూడా పతకాలు వచ్చాయని తెలిపారు. మెన్స్ఉ, మెన్స్ కేటగిరీల్లో ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్స్ రావడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.