Junior College Guest Faculty Dharna at Sajjala Office: డిమాండ్ల పరిష్కారానికై జూనియర్ కళాశాలల అతిథి అధ్యాపకుల ధర్నా - ap news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-08-2023/640-480-19319540-thumbnail-16x9--junior-college-guest-faculty--dharna.jpg)
Junior College Guest Faculty Dharna at Sajjala Office: జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్ కళాశాలల్లోని అతిథి అధ్యాపకులు ధర్నా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి తాడేపల్లిలోని సజ్జల కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత 15ఏళ్లుగా పది వేల జీతంతో పని చేస్తున్నామని ఆవేదన చెందారు. ఆ డబ్బులతో ఇల్లు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని సజ్జల కార్యాలయానికి చేరుకున్న అతిధి అధ్యాపకులు.. న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకులంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు. గవర్నమెంట్ జూనియర్ అధ్యాపకులతో పాటు సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారితో పోల్చితే.. తమకు వచ్చే జీతం ఏ మాత్రం సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమస్యను సజ్జలకు వివరించేందుకు వచ్చామని తెలిపారు. మా జీవితాల్లో జగనన్నే వెలుగులు నింపాలని కోరారు. తాము పడుతున్న కష్టానికి ప్రతిఫలం అందేవిధంగా చూడాలని, అతిథి అధ్యాపకులు కోరారు.