JC Prabhakar Reddy At Vijayawada Court: 'మేము అధికారంలోకి వస్తే వారి కేసుల పెట్టము' - అనంతపురం జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
JC Prabhakar Reddy At Vijayawada Court :రాజు తలచుకుంటే దెబ్బలు కరువా.. రాజు తలుచుకున్నాడు కేసులు పెట్టారని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేసులకు తాను భయపడనని తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు గురువారం ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాలో మాట్లాడారు.
రాజకీయంగా ఎదుర్కోవాలని.. మేము అధికారంలోకి వస్తే తాను కేసులుపెట్టనని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మా వాళ్లు అధికారంలోకి వచ్చాక కూడా కేసులు వద్దని చెపుతానని, క్షమాగుణం పగ కన్నా గోప్పదని, రాజకీయంగా పగ ఉండకూడదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికి తనపై 78 కేసులు పెట్టారని, మరో జన్మ ఉంటేనే ఈ కేసులను పూర్తి చేసుకోలేనని, జైలుకు వెళ్లడానికి భయపడేది లేదని స్పష్టం చేశారు. తాము పగ సాధించాలనుకుంటే ఇప్పడు పవర్లో ఉన్న వారు అందరూ కోర్టులోనే ఉంటారని చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.