Janasena Protest: 'మా నమ్మకం మీరే అన్నందుకు'.. జనసేన వినూత్న నిరసన - కృష్ణాజిల్లాలో జనసైనికుల వినూత్న నిరసన
🎬 Watch Now: Feature Video
Janasena Protest In Gudiwada: గుడివాడలో జనసేన నాయకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. గత మూడు రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లోనికి వెళ్లడానికి కనీస మార్గం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని గోడలపై ఉన్న 'మా నమ్మకం నువ్వే జగనన్న' పోస్టర్‌కు జనసేన నాయకులు దండం పెడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. మా నమ్మకం మీరే అన్నందుకు గత నాలుగేళ్లుగా సీఎం జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడకు చేసింది ఏమీ లేదని వాపోయారు. వారిని నమ్మినందుకు ప్రజలను ఇంకా హీనస్థితికి దిగజార్చారని జనసైనికులు విమర్శించారు. నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్టాండ్‌ని చూస్తే గుడివాడ పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వారు విమర్శించారు.