Janasena Leaders Arrested at Gitam University: గీతం విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత.. జనసేన నేతలు అరెస్ట్ - janasena incharge Sandeep comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 3:46 PM IST

Janasena Leaders Arrested at Gitam University: విశాఖపట్నం జిల్లాలోని గీతం విశ్వవిద్యాలయం వద్ద పోలీసుల అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వవిద్యాలయం వద్ద తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తును స్వాగతిస్తూ.. పోస్టర్లు వెలిశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తెల్లవారుజామున వాటిని తొలగించారు. అనంతరం వర్సిటీ వద్ద భారీగా మోహరించి.. విద్యార్థుల ఐడీ కార్డులను తనిఖీ చేసి మరీ లోపలికి పంపుతున్నారు. ఈ క్రమంలో జనసేన నేత పంచకర్ల సందీప్‌ను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Janasena Leader Sandeep Comments: జనసేన నేత పంచకర్ల సందీప్‌ మీడియాతో మాట్లాడుతూ..''టీడీపీ-జనసేనల పొత్తుతో జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే జనసేన నేతలను అరెస్టులు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపిన రోజు నుంచి ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. టీడీపీ-జనసేన పొత్తులపై ఆత్మ విశ్వాసం పెరిగింది. అందుకే తప్పును వ్యతిరేకించేందుకు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈరోజు గీతం విశ్వవిద్యాలయంలోకి ప్రజా నాయకులను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుపడుతున్నారు. ప్రజలు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి.. వైసీపీ వాళ్లు ముందు రిషికొండను కబ్జా చేశారు,.. ఆ తర్వాత ఎర్రమట్టి దిబ్బలను కబ్జా చేశారు, చివరికి విశ్వవిద్యాలయాలను కూడా కబ్జా చేశారు.. రేపు పొద్దున్న మిమ్మిల్ని కూడా మీ ఇళ్లలోంచి బయటికి రానివ్వరు'' అని ఆయన అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.