Janasena Leader Gade Venkateswara Rao on YCP Bus Yatra: 'బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమిచ్చారని సామాజిక సాధికారత బస్సుయాత్ర?' - TDP leaders Allegations on YCP bus Yatra
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 5:18 PM IST
Janasena Leader Gade Venkateswara Rao on YCP Bus Yatra: వైసీపీ సామాజిక సాధికారత బస్సుయాత్ర హాస్యాస్పదంగా ఉందని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏం సాధికారత ఇచ్చారని బస్సుయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. జగనన్న బస్సు ఎక్కటానికి అవకాశం ఇచ్చారని జోగి రమేష్ సంబరపడుతున్నారని.. మంత్రులు ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండటం బాధాకరమని అభిప్రాయపడ్డారు.
ఎస్సీ కార్పోరేషన్‌ను విడగొట్టాక ఎంత నిధులిచ్చారో ఎస్సీ ఎమ్మెల్యేలు చెప్పాలని గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేలు వెళ్లి నేరుగా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. కులాల వారిగా కార్పోరేషన్లు విభజించి ఒక్క రూపాయి నిధులివ్వలేదని ఆరోపించారు. బీసీలకు ఏదైనా మంచి చేశానని ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు చెప్పగలరా అని సవాల్ విసిరారు. పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్‌ని వైసీపీ కార్యకర్తలు పెట్రోల్ పోసి చంపితే ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజు త్వరలోనే ఉందని అన్నారు.