Janasena fire on CM Jagan visit to Tirupati: సీఎం జగన్ తిరుపతి పర్యటన సర్కస్‌ను తలపించింది: జనసేన - janasena news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2023, 10:57 PM IST
Janasena Fire on CM Jagan Visit to Tirupati: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనపై జనసేన నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం రోజు సీఎం జగన్ తిరుపతి పర్యటన ఓ సర్కస్‌ను తలపించిందని విమర్శించారు. ప్రతిసారి కుటుంబ సమేతంగా తిరుమలకు రావాల్సిన జగన్.. ఒక్కరే ఎందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
Janasena Incharge Kiran Royal Comments: తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ..''తిరుమలలో పురోహితులు సీఎం జగన్‌కు తలపాగా కడుతున్న సమయంలో చిన్న పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకునేటప్పుడు చేసే నటనను జగన్ నటించి చూపించారు. రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన మీ నైజం గురించి ప్రజలందరికీ తెలుసు. అక్షింతలతో అర్చకులు ఆశీర్వదిస్తున్నప్పుడు వాటిని దులుపుకోవడం చూస్తుంటే.. జగన్‌కు పిచ్చి బాగా ముదిరిందని తెలుస్తోంది. మా అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లు జగన్‍కు మానసికస్థితి సరిగా లేదనిపిస్తోంది. కొడాలి నాని తితిదే ఉద్యోగులపై దురుసుగా వ్యవహరించటం సబబు కాదు. వచ్చే ఎన్నికల్లో సీటు రాదని గ్రహించిన రోజా.. మోకాళ్ళపై కూర్చోని జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. తిరుమలకు వదినను తీసుకురమ్మని మంత్రి రోజా తన అన్న జగన్‍కు చెప్పవచ్చు కదా..?. మా అధినేత పవన్ కల్యాణ్‌పై, జనసేన నాయకులపై రోజా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.'' అని ఆయన హెచ్చరించారు.