Pawan tweet on Jagan: 'పాపం పసివాడు' క్లాస్ వార్ గురించి తెలుసుకో..: పవన్ - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 18, 2023, 10:00 PM IST

Pawan Kalyan tweet on Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపక్షాలను ఉద్దేశించి చేసిన క్లాస్ వార్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ల పర్వం కొనసాగుతోంది. బుధవారం నాడు సీఎం జగన్​పై  పవన్ కల్యాణ్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పాపం పసివాడు’’ సినిమా పేరును ప్రస్తావిస్తూ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇవాళ కథాకళి పేరుతో ఓ వీడియోని ట్వీట్ చేశారు. అందులో ముఖ్యమంత్రి జగన్ క్లాస్ వార్ గురించి చేసిన వ్యాఖ్యలు.. వాటికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, అధికార ప్రతినిధి వేములపాటి అజయ కుమార్ మధ్య జరిగిన చర్చకు సంబంధించి వీడియో జతపరిచారు. ఆరు చోట్ల ప్యాలెస్​లు కట్టుకున్న జగన్ పేదల పక్షపాతిగా మాట్లాడటం విడ్డూరమని వారు అభిప్రాయపడ్డారు. బహుశా జగన్ క్యాష్ వార్ గురించి మాట్లాడి ఉంటారని చర్చలో అభిప్రాయపడ్డారు. ఆ వీడియోకు పాపం పసివాడు జగన్ కూడా క్లాస్ వార్ గురించి తెలుసుకోవాలనే వ్యాఖ్యను పవన్ జోడించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.