కోర్టు ధిక్కరణ - గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలుశిక్ష!
🎬 Watch Now: Feature Video
Jail sentence for Guntur Municipal Commissioner: ఏపీలో ప్రభుత్వాధికారులకు కోర్టు ధిక్కరణ అనేది పరిపాటిగా మారింది. అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లు, స్థానిక పరిస్థితులతో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న మాదిరిగా తయారయింది. గుంటూరు జిల్లా మున్సిపల్ కమిషనర్‌కు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ జైలు శిక్షవిధిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. వచ్చే నెల 2వ తేదీన రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవటంతో, కోర్టు ధిక్కరణ కింద ఈ మేరకు ఆదేశాలిచ్చింది. గుంటూరు కొత్తపేటలో యడవల్లి వారి సత్రం సంబంధించి లీజు విషయంలో వివాదం నెలకొంది. దీనిపై గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారించిన హైకోర్టు, ఈయేడాది మే లోగా కొంత నగదు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవటంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని కోర్టు భావించింది. ఈ మేరకూ మున్సిపల్ కమిషనర్‌కు నెల రోజుల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. వచ్చే నెల 2వ తేదీన రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
TAGGED:
Guntur Commissioner Keerthi