Jaibheem Bharat Party Shravan met Vijayawada CP: 'ప్రభుత్వ పెద్దల నుంచి నా ప్రాణాలకు ముప్పు ఉంది.. భద్రతా కల్పించండి' - Jaibheem Bharat Party Shravan news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 9:50 PM IST

Jaibheem Bharat Party Shravan met Vijayawada CP: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు వ్యక్తిగత భద్రత కల్పించాలని.. జై భీమ్ భారత్ పార్టీ అధినేత శ్రావణ్ కుమార్ విజయవాడ కమిషనర్ (సీపీ) కాంతిరాణాను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రాతపూర్వక అభ్యర్థనలో పేర్కొన్నారు.

Shravan Kumar Comments: ''రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుండే నాకు, నా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉంది. భద్రత కల్పించాలని గురువారం నాడు  ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతిరాణాను కలిసి వినతిపత్రం అందజేశాను. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా నా ప్రాణాలకు ముప్పు ఉందని రాతపూర్వక అభ్యర్థనలో నేను సీపీకి వివరించాను. రాష్ట్ర ప్రభుత్వమే నాకు రక్షణ కల్పించాలని కోరాను. నాకు, నా కుటుంబానికి ఎటువంటి ప్రాణహాని జరిగినా.. దానికి రాష్ట్ర ప్రభుత్వమే భాధ్యత వహించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం.. ఎవరికి అన్యాయం జరిగినా వారి తరుఫున పోరాడుతున్నాను. ఇటువంటి సమయంలో ప్రభుత్వ పెద్దలే ప్రాణాలు తీయడానికి ప్రణాళిక రచన చేస్తారా..? మా రక్షణపై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.