తిరుమలలో ఎడతెరిపి లేని జల్లులు - తీవ్రమైన చలి కారణంగా భక్తులు ఇబ్బందులు - తిరుపతి వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 7:03 PM IST
Rains in Tirumala : తిరుమలలో తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు.. మరోవైపు చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ విక్రయశాలకు, విశ్రాంత గదులకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. మరి కొందరు టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల కింద తలదాచుకున్నారు.
PM Modi visit tirumala : ఈ రోజు (నవంబరు 27న) ఉదయం 8 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి.. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శన అనంతరం.. స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం, క్యాలెండర్, డైరీని ప్రధానికి అందజేశారు. అనంతరం తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం.. తిరుపతి నుంచి హకీంపేటకు బయలుదేరారు. మోదీ పర్యటనలో భాగంగా.. శ్రీవారి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.