యువగళం ముగింపు సభకు మద్దతుగా హైదరాబాద్ నుంచి విశాఖకు కార్లు, బస్సులతో భారీ ర్యాలీ - ఏపీ టీడీపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 10:34 PM IST

Updated : Dec 17, 2023, 6:12 AM IST

 IT employees support Yuvagalam meeting: ఆంద్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి టీడీ. జనార్దన్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని విధ్వసం చేసి మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు విస్మరించారని ఆరోపించారు. కూకట్ పల్లి హైదర్ నగర్ డివిజన్ లోని మిత్రహీల్స్ లింక్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి విశాఖపట్నంకు తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ యువగలంకు  మద్దతుగా తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వాహనల్లో తరలివెళ్లారు. ఈ ర్యాలీ ప్రారంభోత్సవానికి పలువురు టీడీపీ నేతలు హాజరై వారికి సంఘీభావం తెలిపారు. మియాపూర్ నుంచి భారీగా బయలుదేరిన కార్లు, బస్సుల ర్యాలీని టీడీ. జనార్దన్ జెండా ఊపి ప్రారంభించారు. 

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు స్వాతంత్రం లేకుండా పోయిందని సోషల్ మీడియా లో పెట్టె పోస్టులకు సైతం అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని టీడీ. జనార్దన్ ద్వజమెత్తారు. ప్రజలకు, అణగారిన వర్గాలకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు నారా లోకేశ్ యువగళం పేరుతో వేల కిలోమీటర్లు పాదయాత్ర  చేపట్టారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటీష్ వాళ్లను తరిమి కొట్టినట్లు వైసీపీ పార్టీని తరిమికొట్టాల్సిందిగా నారా లోకేశ్ పిలుపునిచ్చారు అని అన్నారు. రాష్ట్రంలో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సహజ వనరులను సైతం కొల్లగోట్టి దారుణ విధ్వసం కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Last Updated : Dec 17, 2023, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.