IMA on Hospitals Protection Act: 'రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆసుపత్రుల పరిరక్షణ చట్టాన్ని సవరించాలి'

🎬 Watch Now: Feature Video

thumbnail

IMA State President Ravi Krishna on Hospitals Protection Act: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రుల పరిరక్షణ చట్టాన్ని సవరించాలని.. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో పర్యటించిన రవికృష్ణ.. ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రైవేటు వైద్యులు, ఆసుపత్రులు, రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2008లో ప్రవేశపెట్టిన చట్టంలోని నిబంధనలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Ravi Krishna Comments: ''ప్రైవేటు వైద్యులు, ఆసుపత్రుల పరిరక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సవరించాలి. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ మ్యానువల్‌‌లో ఆసుపత్రులు, వైద్యులపై జరిగిన దాడులకు సంబంధించి.. బాధ్యులపై తీసుకునే చట్టపరమైన అంశాల్లో మార్పులు చేశారు. ఆ మార్పులను రద్దు చేసి, 2008లో ప్రవేశపెట్టిన చట్టంలోని నిబంధనలనే అమలు చేయాలి. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ విషయంలో అగ్నిమాపక నిబంధనలను సవరించాలి. నూతన వైద్య విధానాల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐఎంఏను సంప్రదించాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని ఒకట్రెండ్ ప్రత్యేక చికిత్సలున్న వైద్యశాలలకు విస్తరించాలి. నూతనంగా ఏర్పడే ప్రైవేటు ఆసుపత్రుల అనుమతుల విషయంలో ఏకగవాక్ష విధానాన్ని అమలు చేయాలి. అన్ని రకాల వైద్య విధానాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్న ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలి.'' అని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు రవికృష్ణ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.