గంజాయి మార్పిడి కేంద్రంగా గుంతకల్లు - పోలీసులకు చిక్కిన ₹15 లక్షల సరకు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 1:14 PM IST
Illegal Ganja Transport in Anantapur District : ఒడిశా నుంచి గుజరాత్ సహా ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేయడానికి స్మగ్లర్లు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్‌ను సరుకు మార్పిడి కేంద్రంగా వినియోగించుకుంటున్నారు. 2 రోజుల్లో రైల్వే పోలీసులు 15 లక్షల రూపాయల విలువచేసే 96 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుంచి గంజాయిని విశాఖపట్నం, విజయవాడ, ఖాజీపట్నం మీదుగా రైళ్లలో తరలించేవారు. ఆ మార్గంలో తనిఖీలు ముమ్మరం కావడంతో గుంటూరు మీదుగా గుంతకల్లు చేరుకుని రైలు మారి గుజరాత్‌కు గంజాయి తరలిస్తున్నారని రైల్వే డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
Police Seized 96 KG Ganja in Guntakal : గంజాయి రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త దారులను ఎంచుకుంటున్నారు. ప్రయాణికులుగా దర్జాగా రైళ్లలో ప్రయాణిస్తూ సరకు రవాణా చేస్తున్నారు. అనుమానం రాకుండా స్మగ్లర్లు పెద్ద ఎత్తున ఒకేసారి తరలించకుండా తక్కువ మోతాదులో సంచుల్లో సూట్ కేసుల్లో తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.