Idupulapaya Triple IT College Student Commits Suicide: ఇడుపులపాయలో విషాదం.. ఉరివేసుకుని ట్రిపుల్​ ఐటీ విద్యార్థి ఆత్మహత్య - ఉరివేసుకుని తెర్నాంపల్లి విద్యార్థి ఆత్మహత్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 11:50 AM IST

Idupulapaya Triple IT College Student Commits Suicide: కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇడుపులపాయలో ట్రిపుల్​ ఐటీ​ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది అతడ్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పులివెందులలోని తెర్నాంపల్లికి చెందిన గంగారాం అనే విద్యార్థి ఇడుపలపాయలోని  ట్రిపుల్​ ఐటీ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో వసతి గృహంలో ఉన్న సీలింగ్​ ఫ్యాన్​కు ఉరివేసుకున్నాడు. ఈ సమయంలో అటుగా వచ్చిన తోటి మిత్రులు గమనించారు. వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించగా.. వసతి గృహం వద్దకు చేరుకున్నారు. వెంటనే అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గంగారాంను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వసతి గృహం వద్దకు చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.