Rain Water: చెరువైన హైదరాబాద్-విజయవాడ హైవే - హైదరాబాద్ వర్షాలు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Rain water on Vijayawada Highway: హైదరాబాద్లో కురిసిన అకాల వర్షం విజయవాడ జాతీయ రహదారిని ముంచెత్తింది. ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు వర్షం కుండపోతలా కురవడం, ఎగువన సాహెబ్ నగర్ చెరువు నుంచి భారీగా వరద రోడ్డుపైకి రావడంతో.. జాతీయరహదారి చెరువును తలపించింది. రోడ్డుపైకి మోకాలి లోతు వరకు వర్షపు నీరు చేరింది. ఫలితంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలతో సాయంత్రం ఇంటికి వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ హయత్‌నగర్‌లో 6.2సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST