Husband Commits Suicide After killing His wife: భార్యను హత్య చేసిన భర్త.. ఆమె సోదరుడికి సమాచారం ఇచ్చి తానూ ఆత్మహత్య - AP Crime News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 10:34 AM IST
Husband Commits Suicide After killing His wife: భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరిలోని పార్క్ రోడ్డులో ఒకటో లైన్లో ఆనంద్ పాల్, అర్చన అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడుతున్నారని స్థానికులు పోలీసులకు చెప్పారు. బుధవారం సాయంత్రం వీరి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భార్య అర్చనను భర్త ఆనంద్ హత్య చేశాడు. అనంతరం ఆంనంద్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యను హత్య చేసిన విషయాన్ని అర్చన సోదరుడికి భర్త ఆనంద్ ఫోన్లో సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి చూసేసరికే భర్త ఆనంద్ కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పరిశీలించి ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రి ఇద్దరు చనిపోవడంతో.. పిల్లలు దిక్కులు చూస్తున్నారు. క్షణకాలిక ఆవేశంలో ఆదరించాల్సిన అమ్మా,నాన్నలు ఇద్దరు మృతి చెందడంతో..అనాథలుగా మారిపోయారని స్థానికులు కంటతడిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.