Huge Devotees At Tirumala Tirupati శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తిరుమల శ్రీవారి దర్శనానికి 48 గంటలు - ap telugu news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2023, 8:18 PM IST
Huge Devotees At Tirumala Tirupati తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తమిళులు అత్యంత పవిత్ర మాసంగా భావించే పెరటాసి రెండోవ శనివారం కావడంతో అశేష సంఖ్యలో తమిళుల భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలో ఎటు చూసినా భక్తజన సందోహంగా మారింది. అనూహ్యంగా పెరిగిన రద్దీ కారణంగా ఎలాంటి టోకెన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 48 గంటల సమయం (48 Hours for Tirumala Srivari Darshan) పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండడంతో 2 కిమీ మేర ఔటర్ రింగ్ రోడ్డులోకి క్యూ లైన్ చేరింది. తోపులాట్లకు తావు లేకుండా విడతలు-విడతలుగా భక్తులను విజిలెన్స్ సిబ్బంది క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిరంతరాయంగా అన్నపానీయాలను శ్రీవారి సేవకులు సరఫరా చేస్తున్నారు. భక్తుల రద్దీ మరో రెండు వారాలు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ముందుస్తు చర్యలు చేపట్టింది. అధిక రద్దీ కారణంగా స్వామి వారి దర్శనం ఆలస్యం పట్టడంతో భక్తులు సమన్వయం పాటించాలని తితిదే విజ్ఞప్తి చేస్తోంది.