విజయవాడలో చిన జీయర్ స్వామి - సత్కరించిన పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు
🎬 Watch Now: Feature Video
Honoring Chinna Jeeyar Swamy in the Name of Acharya Seva : ఆధ్యాత్మిక వేత్త చిన జీయర్ స్వామికి పలువురు ప్రముఖులు విజయవాడలో ఆచార్య సేవ కార్యక్రమం చేపట్టారు. అనేక మంది పేద, అనాథ బాలలకు ఉన్నత చదువులు అందిస్తున్నారని.. చిన జీయర్ స్వామిని వక్తలు కొనియాడారు. సమాజంలో చెడును పోగొట్టి మంచిని నింపడానికి గత నలభై సంవత్సరాలుగా చిన జీయర్ స్వామి కృషి చేస్తున్నారని తెలిపారు. స్వామి చేస్తున్న సేవా కార్యక్రామాలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురష్కారాన్ని అందించిందన్నారు. ఆయన పురస్కారం అందుకున్న సందర్భంగా సత్కారం, ఆచార్య సేవ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి విజయవాడలో నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. స్వామిని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు సత్కరించారు.
జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు చిన జీయర్ స్వామి అభినందించారు. అంధ కళాశాల విద్యార్థులు క్రికెట్ పోటీల్లో గెలిచిన సందర్భంగా ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం స్వామి మాట్లాడుతూ.. జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంధ పాఠశాల స్థాపించి ఎంతో మందికి విద్య అందిస్తున్నామని అది క్రమేపీ జూనియర్, డిగ్రీ కళాశాలగా ఆవిర్భవించిందని తెలిపారు. రానున్న రోజుల్లో న్యాయ కళాశాల స్థాపించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.