HLC Sub-Canal Drop Vandalized హెచ్‌ఎల్‌సీ సబ్ కెనాల్ డ్రాప్‌ను ధ్వంసం చేసిన రైతులు..! దిగొచ్చిన అధికారులు.. - ap news
🎬 Watch Now: Feature Video
HLC Sub-Canal Drop Vandalized by Farmers : అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ పరిధిలోని 9వ బ్రాంచ్ కాలువ కింద చివరి అయకట్టు భూములకు సాగునీరు అందడం లేదని బొల్లనగుడ్డం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు సాగు నీరు విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోకపోవడంతో రైతులు తారకపురం వద్ద బ్రాంచ్ కెనాల్‌లోని డ్రాప్‌ను పగలగొట్టారు. సబ్ కెనాల్‌కు ఉన్న సిమెంట్ అడ్డుగోడలను జేసీబీ సాయంతో తొలగించారు. దీంతో కనేకల్ హెచ్ఎల్ఏ, డీఈ, ఏఈలు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం బాధ్యులైన రైతులపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. రైతుల చర్యలతో కాలువ గట్లపై అధికారుల నిఘా పెంచారు. నీటి విడుదలకు చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. గతంలో పోల్చితే ఈసారి వర్షాలు తక్కువగా నమోదు కావడం, తుంగభద్ర జలాశయానికి ఇన్ ఫ్లో భారీగా తగ్గిపోవడంతో సాగు నీరు అందక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు ఆయకట్టు భూముల్లో వరినారులు పోసుకొని నాట్లు కోసం పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు.