మచిలీపట్నంలో టీడీపీ, జనసేన శ్రేణుల అరెస్టు - ఉద్రిక్త వాతావరణం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 6:52 PM IST

thumbnail

High Tension at Machilipatnam: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 'రాజాగారి సెంటర్'​లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ, జనసేన నేతలు తొలగించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. మచిలీపట్నం ప్రధాన కూడలి 'రాజాగారి సెంటర్'​ను గత మూడేళ్లగా పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. వ్యాపార కూడలైన 'రాజాగారి సెంటర్​'లో ఉన్న కొంత మంది వ్యాపారస్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని(YSRCP MLA Perni Nani)ఈ చర్యలకు పాల్పడ్డారని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. 

TDP-Jansena Leaders Arrest in Krishna District: దీనిపై అనేకసార్లు వ్యాపార సంస్థల ప్రతినిధులతో పాటు టీడీపీ, జనసేన నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం సహా జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని టీడీపీ, జనసేన శ్రేణులు ఈ రోజు నిరసన చేపట్టారు. నిరనసకారులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి పలు పోలీస్​ స్టేషన్లకు తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.