విశాఖకు కార్యాలయాల తరలింపు కేసుపై విచారణ - చర్యలు వద్దని హైకోర్టు ఆదేశం - Destruction of Rushikonda

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2023, 9:52 AM IST

High Court Verdict on Shifting Govt offices to Visakha: సీఎం క్యాంపు కార్యా లయం ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను తగిన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అమరావతి, విశాఖపట్నంలో కార్యాలయాల నిర్మాణం కోసం అనవసర ఖర్చును నివారించడం కోసం ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రజాధనానికి ప్రభుత్వం ధర్మకర్త అని గుర్తు చేసింది. 

త్రిసభ్య ధర్మాసనం విచారణ జర పాలా లేదా అనే విషయమై తగిన నిర్ణయం తీసుకునేందుకు వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీరజ్​ సింగ్ ఠాకుర్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తద్వారా పరస్పర విరుద్ధ ఉత్తర్వుల జారీకి వెసులుబాటు లేకుండా ఉంటుందని తెలిపింది. న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఆ ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.