High Court Reserved Verdict in Ananthbabu Case: కేసులో వారిని ఎందుకు చేర్చలేదు..? హత్య కేసులో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు - అనంతబాబు హత్య కేసు
🎬 Watch Now: Feature Video
High Court Reserved Verdict in Ananthbabu Case : దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్న వాళ్లందరి పేర్లు ఎందుకు చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం ఎమ్మెల్సీ అనంతబాబును మాత్రమే చేర్చడానికి కారణమేంటని నిలదీసింది. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా నీరుగార్చేలా వ్యవహరించారని.. పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. కేసు వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించింది. హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
AnanthBabu killed Driver Subrahmanyam: ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఇంటి నుంచి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేసి.. మృతదేహాన్ని తెల్లవారుజామున తన కారులో తీసుకువచ్చి ఇంటివద్ద వదిలేసి వెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పౌరహక్కుల సంఘాల ఆధ్వర్యంలో కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు న్యాయ పోరాటం చేశారు. ఈ కేసును తప్పు దారి పట్టించారని పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.