Heavy Rains in Visakha: విశాఖలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు - విశాఖలో భారీ వర్షాలు
🎬 Watch Now: Feature Video
Heavy Rains in Visakha: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాల ధాటికి విశాఖ నగరం అతలాకుతలమైపోతోంది. పూర్ణ మార్కెట్, చావులమదుం, స్టేడియం రోడ్డు, రైల్వే న్యూ కాలనీ, జ్ఞానాపురం, షీలా నగర్ సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. చావుల మదుం రైల్వే వంతెన కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్టేడియం రోడ్డు, పూర్ణ మార్కెట్ ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగి.. నీరు బయటికి ప్రవహిస్తోంది. జ్ఞానాపురంలోని మెయిన్ రోడ్డు, గెడ్డవీధి నుంచి గెడ్డ వరకూ వరద మోకాలి లోతు వరకు నిలిచిపోవడంతో వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ఉదయం వర్షం కాస్త తగ్గి.. ఎండ కాసింది. అయితే మధ్యాహ్నం 1:30 గంటల నుంచి దట్టంగా కమ్ముకున్న మేఘాలు పూర్తిగా వాతావరణాన్ని చీకటిగా మార్చాయి. ఒక్కసారిగా మొదలైన వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. పలు పల్లపు ప్రాంతాలలో వర్షపు నీరు వచ్చి చేరుతోంది. గడ్డల్లో ప్రవాహాలు భారీగా పెరిగాయి. వర్షాల ఉద్ధృతికి రహదారులపై భారీగా నీరు చేరింది. పూర్ణ మార్కెట్, చావులమదుం, స్టేడియం రోడ్డు, రైల్వే న్యూ కాలనీ, జ్ఞానాపురం, షీలా నగర్.. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రైల్వే వంతెన కింద భారీగా వర్షపు నీరు చేరిపోవటంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర రహదారులపై సాధారణ ప్రజల రాకపోకలు బాగా తగ్గాయి.
విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.. ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
- జిల్లా కలెక్టరు కార్యాలయం : 0891-2590100, 0891-2590102
- జీవీఎంసీ కంట్రోల్ రూమ్ : 1800-4250-0009/08912869106
- ఆర్డీఓ కార్యాలయం, విశాఖపట్నం : 0891-2562977
- ఆర్డీఓ కార్యాలయం, భీమునిపట్నం : 08933-293990
- తహసీల్దార్ల కంట్రోల్ రూమ్ నంబర్లు:
- సీతమ్మధార : 9849903824
- విశాఖపట్నం రూరల్ : 9100064940
- పద్మనాభం :9100064935
- భీమునిపట్నం : 8008205734
- ఆనందపురము : 7569340226
- గాజువాక : 9849903843
- మహారాణిపేట : 9440151095
- ములగాడ : 9494927475
- పెందుర్తి : 9100064938
- గోపాలపట్నం : 9441571485
- పెదగంట్యాడ : 9059157962