'అక్కడ దస్త్రాలు కదలాలంటే లంచం ఇవ్వాల్సిందే!' - గొట్టిపాడు పంచాయతీ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 9:14 AM IST
Guntur District Sub-Sarpanch Sivaranjani went in dharna: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయం ఎదుట గొట్టిపాడు గ్రామ ఉప సర్పంచ్ శివరంజని ధర్నాకు దిగారు. గొట్టిపాడు పంచాయతీలో జరిగిన సమావేశంలో 9 లక్షల నగదు ఏ పనుల నిమిత్తం ఖర్చు చేశారో తెలపాలని శివరంజని రిజిస్టార్లను ప్రశ్నించారు. పంచాయతీలోని అవకతవకలపై విచారణ జరిపించాలని డీపీవోకి (Distict Panchayat Office) ఫిర్యాదు చేశారు. రిజిస్టర్లు, బిల్లులు వంటి రికార్డులు ఏమి లేకుండా పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఎందుకు నిర్వహించడం అని ఆమె ప్రశ్నించారు.
14 మంది పారిశుద్ధ్య కార్మికుల నుంచి గుమస్తా వెంకట రామయ్య రూ.2500 చొప్పున లంచం వసూలు చేశారని ఆరోపించారు. ఉన్నతాధికారుల వద్ద దస్త్రాలు కదలాలంటే లంచం ఇవ్వాల్సిందే అని ఆమె పంచాయతీ సమావేశంలో బహిరంగంగా చెప్పారు. పంచాయతీ నిధులు, ఖర్చుల వివరాల గురించి రిజిస్టార్లపై వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతభత్యాలు చెల్లించట్లేదని ఆమె అన్నారు. డీపీవో శ్రీదేవి స్పందిస్తూ గొట్టిపాడు పంచాయతీపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు.