MLA Venkatarami Reddy on Media: మాకు ఏ మీడియా వద్దు.. వాలంటీర్లే బలం: ఎమ్మెల్యే వైవీఆర్ - ఎమ్మెల్యే వైవిఆర్
🎬 Watch Now: Feature Video

MLA Venkatarami Reddy on Media: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో స్థానిక మార్కెట్ యార్డులో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవిఆర్ మాట్లాడుతూ.. మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు (వైసీపీ) ఏ మీడియా అవసరం లేదని ఎమ్మెల్యే వైవిఆర్ తెలిపారు. తమ పార్టీకి వాలంటీర్లే అతిపెద్ద మీడియా అంటూ వైవిఆర్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా కార్యకర్తల కన్నా... వాలంటీర్లే పార్టీకి బలమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో వాలంటర్లే పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేలా వాలంటీర్లు కృషి చేయాలని వైవిఆర్ తెలిపారు. దీంతో వాలంటీర్లకు వందనం కార్యక్రమ వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరులు ఎమ్మెల్యే వైవిఆర్ చేసిన వ్యాఖ్యలను అవమానంగా భావిస్తూ కార్యక్రమాన్ని కవర్ చేయకుండానే నిష్క్రమించారు.