Gudivada Bus Stand: కొడాలి నాని.. మాటల్లో ఒరవడి.. అభివృద్ధిలో శూన్యం.. పూర్తికాని గుడివాడ బస్టాండ్ - మాజీ మంత్రులు పేర్ని నాని
🎬 Watch Now: Feature Video
Gudivada Bus Stand: కొడాలి నాని.. నాలుగు పర్యాయాలుగా గుడివాడ ఎమ్మెల్యే. అయితే.. ప్రతిపక్షాలపై ఆయన మాటల్లో ఉన్న ఒరవడి.. అభివృద్ధిలో లేదని ఆ నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ బస్టాండు సంవత్సరాలుగా లోతట్టు ప్రాంతంలో ఉంది. దీనిని ఎత్తు పెంచి పునర్నిర్మిస్తామని పలుమార్లు నాని హామీ ఇచ్చారు. దీనికి నిధులూ మంజూరు అయ్యాయని, పనులు త్వరలో ప్రారంభిస్తామని చెబుతూనే ఉన్నారు. కానీ ఆ దిశగా అడుగు మాత్రం పడనేలేదు. వాన వచ్చిన ప్రతిసారీ ప్రయాణికులు తల్లడిల్లుతూనే ఉన్నారు. ఎంతో చరిత్ర కలిగిన గుడివాడ.. ఎమ్మెల్యే కొడాలి నాని హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని ప్రజలు బాహటంగానే విమర్శిస్తున్నారు. బుధవారం గుడివాడ బస్టాండ్ సమీపంలోని ఘంటసాల ఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి రోజా.. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని సైతం ఇటుగానే వెళ్లినా ప్రజల కష్టాలు వారికి కన్పించకపోవడం గమనార్హం.