యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలి-మంత్రి గుడివాడ అమర్నథ్ - ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-11-2023/640-480-19962399-thumbnail-16x9-gudivada--amarnadh-speech-in-avanthi-engineering-college.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 1:43 PM IST
Gudivada Amarnadh Speech in Avanthi Engineering College: పరిశ్రమల శాఖ మంత్రి అంటే పరిశ్రమలు పెట్టడం కాదని ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరంలో అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ప్రాసెస్ ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావలసిన సదుపాయాలు, అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Ap Minister Amarnadh Speech: ప్రస్తుతం విదేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంతోమంది ప్రముఖులు సాఫ్ట్వేర్ ,ఇతర కంపెనీలను నిర్వహించడం గర్వ కారణమన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తాను ఇదే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నానని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలకు మొదటి ఆటకు వెళ్లే వాళ్లమని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అటువంటివి చేయడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఇక్కడ చదువుకున్న వారంతా దేశానికి ఉపయోగపడే రంగాలలో స్థిరపడి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని మంత్రి అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్,జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, అవంతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.